News December 9, 2024
విశాఖ-సికింద్రాబాద్ మధ్య సంక్రాంతికి స్పెషల్ ట్రైన్

సంక్రాంతి సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ(07097/07098) ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఈనెల 15, 22,29 తేదీల్లో నడపనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్(07097/07098) స్పెషల్ విశాఖ నుంచి 16, 23,30 తేదీల్లో నడుస్తాయన్నారు. >Share it
Similar News
News January 13, 2026
విశాఖ: స్వపక్షంలోనే విపక్షమా..!

కూటమిలో కీలకంగా ఉన్నా.. తనదైన వ్యాఖ్యలతో తరచూ చర్చకు కేంద్రంగా నిలుస్తున్నారు MLA విష్ణుకుమార్ రాజు. డేటా సెంటర్ల ఉద్యోగాల అంశం, రుషికొండ భవనాల, భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో ప్రభుత్వానికి అసౌకర్యం కలిగేలా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కూటమిలో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన.. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఆయనకు సంబంధించిన బకాయిలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో అసహనానికి గురవుతున్నారనే వాదన ఉంది.
News January 13, 2026
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం.. 10 మందికి మెమోలు

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన 10 మంది అధికారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మెమోలు జారీ చేశారు. సోమవారం PGRSలో అర్జీలపై సమీక్షించారు. టౌన్‌ప్లానింగ్, హౌసింగ్ విభాగాల్లో తూతూమంత్రంగా ఎండార్స్‌మెంట్లు ఇస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2, 4, 5, 6, 8వ జోన్‌లలో సంబంధిత కమిషనర్‌లకు, టౌన్‌ప్లానింగ్, DE, ASOలకు మెమోలు జారీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోడల్ అధికారి శేషశైలజను ఆదేశించారు.
News January 13, 2026
విశాఖ: 9 ట్రావెట్ బస్సులపై కేసు నమోదు

ఉప రవాణా కమిషనర్ ఆర్‌సీహెచ్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం కుర్మాన్నపాలెం వద్ద మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బుచ్చిరాజు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 9 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఆదేశించారు.


