News December 10, 2024

కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా సత్రాగచ్చి(SRC)- చెన్నై సెంట్రల్(MAS) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ AC ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులపాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.22807 SRC- MAS మధ్య ప్రయాణించే రైలును ఈ నెల 10, 13, 17న, నం.22808 MAS- SRC రైలును ఈ నెల 12, 15, 19న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News November 8, 2025

కృష్ణా: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

image

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి తన నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ. 14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులు కృష్ణా జిల్లా పెడనకి చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.

News November 8, 2025

మచిలీపట్నం: కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి

image

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాలులో భక్త కనకదాసు జ‌యంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచిన భక్త కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, యోధుడు అని తెలిపారు.

News November 8, 2025

కోడూరు: కూలికి వెళ్లి అనంత లోకాలకు..!

image

వ్యవసాయ కూలి పనుల వెళ్లి విగత జీవిగా యువకుడు కాటికి చేరిన సంఘటన కోడూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓలేటి ఇంద్ర బాబు(27), ఇతర వ్యవసాయ కార్మికులతో ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంట వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో కరెంటు షాక్ గురై అక్కడకక్కడే మృతి చెందాడని ఇంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.