News December 10, 2024

పవన్‌‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చంపుతానని ఆయన పేషీకి కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విజయవాడకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అటు, తనకు కూడా 2రోజుల కిందట ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పిన హోంమంత్రి అనిత.. ఆగంతకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని DGPని ఆదేశించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Similar News

News April 18, 2026

పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు వివరాలు ఇవే…

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
28: ధ్వజారోహణం, శేష వాహ సేవ
29: బంగారు హనుమంత సేవ
30: బంగారు గరుడసేవ
1: కళ్యాణోత్సవం, రథోత్సవం
2: వసంతోత్సవం, అశ్వవాహన సేవ
3: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ
భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.

News April 18, 2026

రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

image

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.

News April 18, 2026

హార్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్

image

హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ షాకిచ్చింది. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US అడ్డుకోవడంపై మండిపడింది. ఇది ఆగేవరకు తమ నియంత్రణ కొనసాగుతుందని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తన హామీలను విస్మరించిందని ఫైరయ్యింది.