News December 10, 2024

ATM నుంచి చిరిగిన నోట్లు వస్తే ఇలా చేయండి!

image

కొన్ని సార్లు విత్ డ్రా చేసినప్పుడు ఏటీఎంల నుంచి చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఆ సమయంలో టెన్షన్ పడకుండా ఆ ఏటీఎం లింక్ అయిన బ్యాంక్‌కు వెళ్లి విత్ డ్రా చేసిన టైం, తేదీ వివరాలతో ఫామ్ నింపితే మంచి నోట్లు ఇస్తారు. అలాగే చిరిగిన, పాడై‌పోయిన నోట్లనూ ఫామ్ నింపకుండానే మార్చుకోవచ్చు. బ్యాంకులు లేదా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా గరిష్ఠంగా రూ.5వేల వరకు ఇలా మార్చుకునేందుకు వీలుంది.

Similar News

News December 30, 2025

కొత్త సంవత్సరం ‘గ్రీటింగ్ స్కామ్స్’.. బీ అలర్ట్!

image

న్యూ ఇయర్ సందర్భంగా ‘గ్రీటింగ్ స్కామ్స్’ పట్ల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను అప్రమత్తం చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, SMS ద్వారా వచ్చే పర్సనలైజ్డ్ గ్రీటింగ్స్, న్యూ ఇయర్ గిఫ్ట్స్ లేదా బ్యాంకు రివార్డుల వంటి లింకులను క్లిక్ చేయొద్దని సూచించింది. లేదంటే ‘Malicious APK’ ఫైల్స్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యి బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, వ్యక్తిగత ఫొటోలను దొంగిలించొచ్చని హెచ్చరించింది.

News December 30, 2025

NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<>NHIDCL<<>>)లో 6 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సివిల్స్ మెయిన్స్ 2024 క్వాలిఫై, ఇంటర్వ్యూకు హాజరైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34 ఏళ్లు. సివిల్స్ మెయిన్స్‌లో సాధించిన మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News December 30, 2025

ఖలీదా జియా మరణం.. బంగ్లాతో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్లేనా?

image

బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ ఆ దేశ తొలి మహిళా ప్రధాని, BNP అధినేత్రి జియా <<18709090>>మరణం<<>> పెద్ద మలుపుగా మారింది. బంగ్లాలో ర్యాడికల్ గ్రూప్‌లు చెలరేగుతుండటంతో BNPతో భారత్‌ సత్సంబంధాల కోసం యత్నిస్తున్న వేళ ఈ పరిణామం జరిగింది. దీంతో బంగ్లాతో కొత్త ప్రయాణానికి బ్రేక్ పడొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.