News December 10, 2024
మా నాన్న మద్దతు ఎప్పుడూ విష్ణుకే : మనోజ్

తన తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉన్నారని మనోజ్ అన్నారు ‘నా త్యాగాలు ఉన్నా నాకు అన్యాయం, పరువు నష్టం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరినా పట్టించుకోలేదు. నేను 4నెలల కిందటే ఇంటికి వచ్చాననేది అవాస్తవం. నా ఫోన్ లొకేషన్ చూస్తే ఇది తెలుస్తుంది. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. నా పరువు, మర్యాదలు తీసే ప్రయత్నంలో భాగం’ అని లేఖలో రాశారు.
Similar News
News February 11, 2026
బొబ్బిలి: స్కూల్ బస్సు బోల్తా

బొబ్బిలి మండలం అలజంగి చెట్టు వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. కారాడ సమీపంలో ఉన్న సన్ రైజ్ ఆశ్రమానికి చెందిన విద్యార్థులు బొబ్బిలి పట్టణంలోని పలు విద్యాసంస్థలలో చదువుతున్నారు. పాఠశాలల నుంచి బుధవారం సాయంత్రం ఆశ్రమానికి వెళ్తుండగా అలజంగి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో 23 మంది విద్యార్థులకు గాయలయ్యాయి. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
News February 11, 2026
అసెంబ్లీలో ఆవు కథలు చెప్పొద్దు.. మంత్రులకు CBN హెచ్చరిక

AP: క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఆవు కథలు చెప్పొద్దని, సమాధానాలు క్లుప్తంగా, అర్థమయ్యేలా ఉండాలని హితబోధ చేశారు. ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు అసెంబ్లీలోనే ఉండాలని, ఎమ్మెల్యేలు ప్రస్తావించే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అటు శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని CM ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 11, 2026
కొత్త కార్పొరేషన్లతో కొత్త సమీకరణాలు

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించడంతో కొత్త రాజకీయ సమీకరణాలు కన్పించబోతున్నాయి. కొత్త GHMCలో చాలా జోన్లలో AIMIM ఆధిపత్యం, సైబరాబాద్‌లో ఆంధ్రా వ్యాపారులు ప్రభావం చూపుతారని విశ్లేషకుల అంచనా. ఇక మల్కాజిగిరి కార్పొరేషన్‌లో WGL, కరీంనగర్, NLG, MDK సహా తెలంగాణ జిల్లాల ప్రజల ప్రాబల్యం కన్పిస్తుంది. దీంతో ఆయా కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందుకు తగ్గట్లు పార్టీల, ప్రాంతాల కొత్త రాజకీయ శక్తులు, అవకాశాలు వస్తాయి.


