News December 10, 2024

జగన్‌ వెంటే ఉంటా: MLC

image

తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నిబంధనలు మేరకు నాకు రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సభ్యునిగా అవకాశం ఇచ్చింది. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా. నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి జగన్’ అని ఆయన చెప్పారు.

Similar News

News December 27, 2025

కృష్ణా: జోగి రమేశ్ ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యం తయారీ.!

image

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులైన అద్దేపల్లి జనార్ధనరావు, జగన్మోహనరావులను పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో శుక్రవారం వీరి ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేశ్ అందించిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యాన్ని తయారు చేశామని నిందితులు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.

News December 25, 2025

మచిలిపట్నం: కలెక్టరేట్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

image

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.