News December 10, 2024

ప్రేమోన్మాదిని పోలీసులే కాల్చి చంపాలి: బాలిక తల్లి

image

నందికొట్కూరులో ప్రేమోన్మాది బాలికకు <<14828920>>నిప్పు<<>> పెట్టిన ఘటనపై తల్లి కన్నీరుమున్నీరయ్యారు. తనకున్న ఒక్క కూతురినీ అన్యాయంగా చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూతురు లహరిని ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నా. అన్యాయంగా చంపేశాడు. వాడిని పోలీసులే కాల్చి చంపేయాలి. లేకుంటే నాకు అప్పగించండి.. సార్. ఇలాంటి ఉన్మాదులకు సమాజంలో బతికే హక్కులేదు’ అంటూ విలపించారు.

Similar News

News March 1, 2026

కర్నూలు: మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. కలెక్టర్ ఆదేశం!

image

కర్నూలు జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ డా.ఏ సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని NCORD సమావేశంలో మాట్లాడుతూ.. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలని, RTC బస్సుల్లో అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. జనవరి నుంచి జిల్లాలో 2 కేసులు నమోదు చేసి 1.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగుపై నిఘా ఉంచాలని రెవెన్యూ, పోలీసు శాఖలను కలెక్టర్ ఆదేశించారు.

News March 1, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: కర్నూలు SP

image

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఓవర్ స్పీడ్ (1,536), హెల్మెట్ లేకుండా (1,388), సెల్‌ఫోన్ డ్రైవింగ్ (392), ట్రిపుల్ రైడింగ్ (63) కేసులపై ఈ-చలాన్లు నమోదు చేశారు. అదనంగా 548 డ్రంకెన్ డ్రైవింగ్, 1,107 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

News March 1, 2026

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కావాలి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా జీడీడీపీ తలసరి ఆదాయం పెంపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని అధికారులకు వివరించారు.