News December 10, 2024
Stock Markets: నేడెలా ఓపెనవ్వొచ్చంటే..

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలవ్వొచ్చు. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.05% ఎగిసింది. జపాన్, కొరియా సూచీలు స్వల్పంగా పెరిగాయి. నిన్న US సూచీలు నష్టపోవడం గమనార్హం. నిఫ్టీకి 24,682 వద్ద రెసిస్టెన్సీ, 24,587 సపోర్టు ఉన్నాయి. టాటా మోటార్స్, సింజిన్, మెట్రోపొలిస్, BEL, లుపిన్, టైగర్ లాజిస్టిక్స్, NHPC, VI షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
Similar News
News November 11, 2025
EXIT POLLS: బిహార్‌లో NDAకే పట్టం!

ఓట్ చోరీ సహ అనేక ప్రభుత్వ వ్యతిరేకాంశాలను ప్రచారం చేసినా బిహార్ ప్రజలు ఎన్నికల్లో అధికార NDA కూటమికే పట్టం కడుతున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేలుస్తున్నాయి. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వేలో NDAకి 145-160 సీట్లు, MGBకి 73-91 సీట్లు వస్తాయని అంచనా వేసింది. JVC-టైమ్స్ నౌ NDAకి 135-150, MGBకి 88-103 సీట్లు వస్తాయని తెలిపింది. మ్యాట్రిజ్-IANS NDAకి 147-167, MGBకి 70-90 సీట్లు దక్కుతాయని పేర్కొంది.
News November 11, 2025
₹12.92 ట్రిలియన్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం

కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే 7% పెరిగి ₹12.92 ట్రిలియన్లకు చేరింది. APR 1-NOV 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి ₹12.08 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్లు గత ఏడాది కన్నా 18% తగ్గి ₹2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. FY 2025-26కి ₹25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం.
News November 11, 2025
లేటెస్ట్ అప్డేట్స్

⋆ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA.. సిరాజ్ ఉర్ రెహమాన్(VZM), సయ్యద్ సమీర్(HYD) యువతను టెర్రరిజంవైపు ప్రేరేపించేలా కుట్ర పన్నారని అభియోగాలు
⋆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై వెనక్కి తగ్గిన YS జగన్.. NOV 21లోగా CBI కోర్టులో హాజరవుతానని స్పష్టీకరణ.. యూరప్ వెళితే NOV 14లోగా కోర్టులో హాజరుకావాలని గతంలో ఆదేశించిన కోర్టు
* జూబ్లీహిల్స్‌లో 50.16% ఓటింగ్ నమోదు


