News December 10, 2024
BITCOIN: 24 గంటల్లో రూ.3.16లక్షలు లాస్
క్రిప్టో కరెన్సీ పెద్దన్న బిట్‌కాయిన్‌లో కన్సాలిడేషన్ కొనసాగుతోంది. 24 గంటల్లోనే $3736 (Rs.3.16L) నష్టపోయింది. నేడు మాత్రం స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది. $97,318 వద్ద ఓపెనైన BTC $97,040 వద్ద కనిష్ఠ, $98,159 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. $477 లాభంతో $97,960 వద్ద చలిస్తోంది. ఇక ఎథీరియమ్ 4.86, XRP 10.45, సొలానా 5.78, BNP 4.96, DOGE 9, ADA 12.73, షిబాఇను 13% మేర పతనమయ్యాయి. క్రిప్టో Mcap తగ్గింది.
Similar News
News December 27, 2024
English Learning: Antonyms
✒ Despair× Contentment, Hope
✒ Derogatory× Laudatory, appreciative
✒ Docile× Headstrong, obstinate
✒ Destructive× Creative, Constructive
✒ Dwarf× Huge, Giant
✒ Eclipse× Shine, eclipse
✒ Eager× Indifferent, apathetic
✒ Ecstasy× Despair, Calamity
✒ Eccentric× Natural, Conventional
News December 27, 2024
మన్మోహన్ విద్యాభ్యాసం.. పెషావర్ టు ఆక్స్‌ఫర్డ్
ఇప్పటి పాక్‌లోని చక్వాల్‌లో వ్యాపారులైన గురుముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు 1932 Sep 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. పెషావర్‌లో అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో చదివారు. దేశ విభజన తర్వాత 1948లో వారి కుటుంబం అమృత్‌సర్‌కు వచ్చింది. పంజాబ్ వర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో మాస్టర్స్, 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో DPhil పట్టా పొందారు.
News December 27, 2024
మన్మోహన్ ఫ్యామిలీ వివరాలు
మన్మోహన్ 1958లో గుర్‌శరన్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈమె ప్రొఫెసర్, రచయిత. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉపీందర్, దమన్, అమృత్ సింగ్ ఉన్నారు. ఉపీందర్ అకోలా వర్సిటీ డీన్, హిస్టరీ ప్రొఫెసర్, ఢిల్లీ వర్సిటీలో హిస్టరీ HODగా పనిచేశారు. ఈమె 6 పుస్తకాలు రాశారు. దమన్ అనేక నవలలు రాశారు. NATGRID సీఈవోగా పనిచేశారు. అమృత్ ACLUలో స్టాఫ్ అటార్నీగా సేవలందిస్తున్నారు. మన్మోహన్ అల్లుళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నారు.