News December 10, 2024
జబర్దస్త్ టు క్యాబినెట్: నాడు రోజా, నేడు నాగబాబు

AP: రాష్ట్ర క్యాబినెట్‌లో నాగబాబు చేరిక ఖాయమైంది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత 6 నెలల్లో MLCగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షోలో జడ్జీలుగా చేసిన రోజా, నాగబాబు వేర్వేరు ప్రభుత్వాల్లో మంత్రులుగా అవకాశం దక్కించుకున్నట్లవుతుంది. అప్పట్లో వీరి మధ్య మంచి సంబంధాలే ఉండగా తర్వాత రాజకీయంగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
Similar News
News September 23, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 23, 2025
జుబీన్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

అస్సాం ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్(52) మృతదేహానికి మరో సారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఎం హిమంత బిస్వశర్మ తెలిపారు. కొన్ని వర్గాలు ఆయన <<17783688>>మరణంపై<<>> అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగపూర్ వైద్యులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నాయని, సీఐడీకి కేసు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. కాగా ఇవాళ అధికార లాంఛనాలతో జుబీన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
News September 23, 2025
24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు తీసుకోలేదు: అమిత్ షా

గత 24 ఏళ్లలో మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్విరామమైన పని PM నిర్ణయాలపై, పనివేగంపై ప్రభావం చూపలేదన్నారు. కఠినమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో ఎలాంటి బాస్ కల్చర్ లేదన్నారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి స్వావలంబన భారత్ విజన్‌ను నిర్దేశించుకున్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆయన చెప్పారు.