News December 10, 2024

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. మూడు రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు. బుధవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జైపుర్ వెళ్తారు. అక్కడ జరిగే బంధువుల వివాహంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మళ్లీ హస్తిన చేరుకుని కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ కమిటీల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి.

Similar News

News December 30, 2025

వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం

image

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ <<18708686>>వేకువజామున<<>> శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తర్వాత VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. 5.30AM నుంచి ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన వారిని అనుమతివ్వనున్నారు. సోమవారం రాత్రి వరకు 55వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు అంచనా. TG CM రేవంత్ రెడ్డి, పలువురు AP మంత్రులు సహా పెద్ద సంఖ్యలో VIPలు చేరుకున్నారు.

News December 30, 2025

ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్

image

AP: ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు.. ఇలా అన్ని రంగాలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. పీపీపీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని చెప్పడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో పరిపాలనను కూడా ప్రైవేటుపరం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.

News December 30, 2025

మైనారిటీలపై మీ రికార్డు చూసుకోండి.. పాక్‌కు ఇండియా కౌంటర్

image

ఇండియాలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది. మైనారిటీల విషయంలో పాక్ అధ్వాన రికార్డు అందరికీ తెలుసని ఎద్దేవా చేసింది. ‘వివిధ మతాలకు చెందిన మైనారిటీలను పాక్ దారుణంగా, ప్లాన్ ప్రకారం బాధితులుగా మారుస్తుందనేది నిజం. మా వైపు వేలు చూపించినంత మాత్రాన అదేమీ మారదు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.