News December 10, 2024
విశాఖలో యువకుడి ప్రాణం తీసిన రూ.2 వేలు

లోన్‌యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) ఓ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. నగదు అంతా కట్టి చివరకు రూ.2 వేలు పెండింగ్‌లో ఉంది. అది కట్టలేదని అతడి ఫొటోలను మార్ఫింగ్ చేశారు. 40 రోజుల క్రితమే పెళ్లి అయిన తన భార్యకు సైతం వాటిని పంపారు. మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 5, 2025
సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. గిరిప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతోపాటు వైద్య శిబిరాల గురించి చర్చించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విన్నవించారు.
News July 5, 2025
ఎండాడలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

ఎండాడ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను మళ్లీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News July 5, 2025
విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురి అరెస్ట్

విశాఖలో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. 25 గ్రాముల మత్తు పదార్థం కలిగి ఉన్న ఒక విదేశీయుడుతో పాటు మరో నలుగురిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.