News December 10, 2024

NLR: అద్దె వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా అద్దె వాహనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు DMHO కె.పెంచలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దాసుపత్రి ఆవరణలోని బాల భవిత కేంద్రం నుంచి రోగులను రవాణా చేసేందుకు వాహనాలు అవసరమని చెప్పారు. వాహనంలో 10 నుంచి 16 సీట్లు ఉండాలని సూచించారు. ప్రతి నెలా రూ.60 వేలు అద్దె ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు బాల భవిత కేంద్రం మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News January 20, 2026

నెల్లూరులో దొంగ నాగ సాధువులు హల్‌చల్

image

నాగ సాధువుల ముసుగులో ఓ ఇద్దరు వ్యక్తులు నెల్లూరులో హల్‌చల్ చేశారు. ఓ ఇంటికి వెళ్లి అన్నం పెట్టమని అడిగారు. వారు లేదని చెప్పడంతో వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు వారిపై దాడికి ప్రయత్నించారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాగసాధువు ముసుగులో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. బూతులు మాట్లాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

News January 20, 2026

నెల్లూరు: తల్లులకు తప్పని నిరీక్షణ.!

image

ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం నీరుగారుతోంది. గతేడాది నుంచి ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా 24,459 మంది గర్భిణీలు నమోదవ్వగా 12,353 మందికి ఆర్థిక సాయం అందింది. 12,106 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 10,656 మంది దరఖాస్తులు వివిధ సమస్యలతో రిజెక్ట్ అయ్యాయి. మొదటి కాన్పుకు ₹5 వేలును రెండు విడతల చొప్పున ఇవ్వాలి. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఒకే విడతలో ₹6వేలు తల్లి ఖాతాకు జామ చేస్తారు.

News January 20, 2026

నెల్లూరు: 12 ఏళ్లలో పల్లె నుంచి పారిశ్రామిక హబ్ దాకా.!

image

గత 12 ఏళ్లలో ముత్తుకూరు ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2014లో కేవలం చేపల వేట, రొయ్యల సాగుకే పరిమితమైన ఈ తీర ప్రాంతం, 2026 నాటికి ఏపీలోనే కీలక ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. అదానీ పోర్ట్ విస్తరణ, భారీ థర్మల్ ప్లాంట్లు, 4-లేన్ రోడ్లతో నేడు గ్లోబల్ మ్యాప్‌లోకి ఎక్కింది. నాడు వలసలకు నిలయమైన ముత్తుకూరు, నేడు వేలాది మందికి స్థానికంగానే ఉపాధి కల్పిస్తూ, రియల్ ఎస్టేట్‌లో రికార్డులు సృష్టిస్తోంది.