News December 10, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.72,050కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరగడంతో రూ.78,600 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.4వేలు పెరిగి రూ.1,04,000కు చేరింది. గత 10 రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Similar News

News January 20, 2026

600 పోస్టులు.. అప్లై చేశారా?

image

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గలవారు JAN 25 వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.12,300 చెల్లిస్తారు. వెబ్‌సైట్: bankofmaharashtra.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 20, 2026

గ్రీన్‌లాండ్‌కు US యుద్ధ విమానం.. బలగాలను పెంచిన డెన్మార్క్

image

గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కు అమెరికా తన యుద్ధ విమానాన్ని పంపింది. నార్త్ అమెరికా రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు NORAD తెలిపింది. మరోవైపు డెన్మార్క్ కూడా గ్రీన్‌లాండ్‌కు అదనపు సైన్యాన్ని, మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను తరలించింది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలని ట్రంప్ చూస్తున్న తరుణంలో ఇరు దేశాలు తమ మిలిటరీ పవర్‌ను పెంచడం ఉత్కంఠ రేపుతోంది.

News January 20, 2026

HURLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<>HURL<<>>)లో 38 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా, MBA, MSW, పీజీ డిప్లొమా, MBBS, LLB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్/స్క్రీనింగ్/సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.hurl.net.in/