News December 10, 2024
ప్రవర్తన బాగాలేదు: ప్రతిపక్షాలకు LS స్పీకర్ వార్నింగ్

పార్లమెంటు నడుస్తున్న తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అసహనం చెందారు. చర్చలు జరగకుండా వాయిదాలు పడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కొందరి ప్రవర్తన నిరాశపరుస్తోందని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇది ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చాలి. మనమంతా సభా మర్యాదను పాటించాలి. కానీ కొన్ని రోజులుగా అంత మంచివి కాని ఘటనలు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
లాంచీలో శ్రీశైలం యాత్ర

TG: కృష్ణా నదిలో నల్లమల అందాలను వీక్షిస్తూ నాగర్‌కర్నూల్(D) సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర పున:ప్రారంభమైంది. మంగళ, గురు, శనివారాల్లో భక్తులు సోమేశ్వరుడిని దర్శించుకున్నాక 9AMకు లాంచీ బయలుదేరుతుంది. మల్లన్న దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. నిర్వాహకులు భోజనం, స్నాక్స్ అందిస్తారు. వన్ సైడ్ జర్నీకి పెద్దలకు ₹2000, పిల్లలకు ₹1600 వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు https://tgtdc.in/లో చూడగలరు.
News November 9, 2025
అన్ని దోషాలను పోగొట్టే రాహు కేతువు పూజ… మీరు చేయించుకున్నారా?

వివాహం కాకపోవడం, సంతాన సమస్యలు, ఆర్థిక, ఉద్యోగ ఆటంకాలతో ఇబ్బందులు పడుతున్నవారు, కాలసర్ప దోషం ఉన్నవారు రాహు కేతువు పూజ చేయించుకుంటారు. సకల దోషాలను పోగొట్టే అత్యంత శక్తిమంతమైన ఈ పూజ APలోని శ్రీకాళహస్తి, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ క్షేత్రాల్లో నిర్వహిస్తారు. దీని ఫలితంతో జాతక దోషాలు తొలగి, జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ పూజ తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలని పండితుల సూచన.
News November 9, 2025
కార్తీకం: ఆదివారం ఎవరికిలా పూజ చేయాలి?

ఆదివారం సూర్యుడిని పూజించాలని చెబుతారు. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, సూర్యుడు రాగానే ‘ఓం ఆదిత్యా నమ:’ అంటూ ఆయన పేర్లను స్తుతించాలని పండితుల సూచన. ‘ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. బెల్లం, పాలు, ఎరుపు వస్త్రాలు దాయడం ఉత్తమం. ఉపవాసం మంచిదే. ఉప్పు-నూనె లేని ఆహారం తినవచ్చు. కార్తీకంలో ఈ నియమాల వల్ల సూర్యానుగ్రహంతో జాతకంలో సూర్యుని స్థానం బలపడి శాంతి, మనశ్శాంతి లభిస్తాయి’ అంటున్నారు.


