News December 10, 2024
నార్త్‌లో దుమ్మురేపుతున్న ‘పుష్ప-2’
‘పుష్ప-2’ హిందీ కలెక్షన్స్ రూ.400కోట్లకు చేరువలో ఉన్నాయి. థియేటర్లలో విడుదలైన 5 రోజుల్లోనే రూ.339 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నిన్న రూ.48 కోట్లు రాబట్టగా, అంతకుముందు తొలి 4 రోజుల్లో వరుసగా రూ.72 కోట్లు, రూ.59 కోట్లు, రూ.74కోట్లు, రూ.86 కోట్లు సాధించింది. నార్త్ అమెరికాలో $10M+ వసూళ్లతో దూసుకుపోతోంది.
Similar News
News February 5, 2025
రూ.86వేలు దాటిన తులం బంగారం
బంగారం ధరలు మండిపోతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.79,050లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరగడంతో రూ.86,240 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,07,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News February 5, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన
హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి ఈరోజు తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచీ విమానం కోసం ఎయిర్‌పోర్టులో పడిగాపులు గాస్తున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇంకా రాలేదని, కనీసం సరైన సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవని మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శన సమయం దాటిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 5, 2025
Stock Markets: నెగటివ్ సంకేతాలొచ్చినా లాభాల్లోనే..
దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,779 ( +40), సెన్సెక్స్ 78,609 (+33) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. మీడియా, మెటల్, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. BPCL, INDUSIND BANK, ONGC, HINDALCO, SHRIRAM FIN టాప్ గెయినర్స్. ASIANPAINT, NESTLE, TITAN, EICHER టాప్ లూజర్స్.