News December 10, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.15,800 పలకగా.. మంగళవారం రూ.15,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి గత సోమవారం రూ.14,000 పలకగా నేడు రూ. 13,500కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్నటిలాగే రూ.14,000 ధర వచ్చింది.

Similar News

News February 5, 2025

WGL: సమగ్ర సమాచారంతో బడ్జెట్ రూపకల్పన

image

సమగ్ర సమాచారంతో బడ్జెట్‌కు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు. బడ్జెట్ 2025-26 రూపకల్పనపై వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్లో రూపొందించడంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అందరి సహకారంతో బడ్జెట్ రూపొందించాలని, మున్సిపల్ చట్టం-2019 ప్రకారం బడ్జెట్ మొత్తం నుంచి 10% గ్రీన్ బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు.

News February 5, 2025

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

image

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. గీసుకొండ మండలం వంచనగిరిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వసతి గృహానికి తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచికరంగా లేదని, గుడ్లు ఉడకని అందిస్తున్నారని తెలిపారు.

News February 5, 2025

MHBD: వైద్యం వికటించి యువకుడు మృతి

image

తొర్రూరు మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాలు.. వైద్యం వికటించి సిద్ధూ(16) మృతి చెందాడు. జలుబు వస్తుందని ఆసుపత్రికి వెళ్తే ఇంజెక్షన్ వేశారని, ఆ వెంటనే సిద్దు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో ఆస్పత్రిలోనే ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!