News December 10, 2024
రాజ్యసభ ఛైర్మన్ తొలగింపు నిబంధనలు ఇవే

రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఓటింగ్ సందర్భంగా ఆ రోజు సభకు హాజరైనవారిలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు అవసరం. రాజ్యసభ ఆమోదం అనంతరం ఇదే తీర్మానం లోక్‌సభలో సాధారణ మెజారిటీతో నెగ్గాలి. ఈ ప్రక్రియ అంతా కూడా Article 67(b), 92, 100 ద్వారా జరుగుతుంది. విపక్షాలకు బలం లేకపోవడంతో రాజ్యసభలో తీర్మానం నెగ్గే పరిస్థితి లేదు.
Similar News
News September 16, 2025
OG రిలీజ్.. పేపర్లతో థియేటర్ నిండిపోతుంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే థియేటర్ల వద్ద రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది భారీ అంచనాల మధ్య రిలీజయ్యే ‘OG’కి ఇంకెంత క్రేజ్ ఉండాలి. ఈనెల 25న ఫ్యాన్స్ షోలో థియేటర్లను పేపర్లతో నింపేందుకు అభిమానులు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరిలోని సాయి రామ్ థియేటర్‌లో స్పెషల్ షో కోసం ఏర్పాటు చేసిన పేపర్స్ చూసి ఇతర అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వందల కేజీల న్యూస్ పేపర్లను కట్ చేయడం విశేషం.
News September 16, 2025
ప్రైవేట్ హాస్పిటళ్లపై సీఎం ఆగ్రహం

TG: ఈ రోజు రాత్రి నుంచి <<17723721>>ఆరోగ్యశ్రీ సేవలను బంద్<<>> చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలకు రూ.75 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ప్రతినెలా బెదిరింపులు తంతుగా మారాయని, ఇక నుంచి అలా చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
News September 16, 2025
రూ.1,779 కోట్లు చెల్లించాం.. బంద్ ఆపండి: ఆరోగ్యశ్రీ సీఈవో

TG: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలను ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,779 కోట్లను హాస్పిటళ్లకు చెల్లించామని తెలిపారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు ₹75 కోట్లు చెల్లించామని వివరించారు.