News December 10, 2024
INDIA కూటమి బాధ్యతలు.. మమతకు YCP మద్దతు!

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్‌కు YCP కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. INDIA కూటమి బాధ్యతల్ని CM మమతా బెనర్జీకి ఇవ్వాలని మిత్రపక్షాలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. దీనికి గొంతు కలుపుతూ కూటమిని నడిపించడానికి మమత సరైన నాయకురాలని YCP MP విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. పెద్ద రాష్ట్రానికి CM అయిన మమత తనను తాను నిరూపించుకున్నారంటూ ఆమెకు మద్దతు పలకడం గమనార్హం.
Similar News
News January 28, 2026
T20 WC.. ఎవరైనా అప్సెట్ చేయొచ్చు: ద్రవిడ్

T20 WCలో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోందని మాజీ కోచ్ ద్రవిడ్ అన్నారు. ‘ఇండియా వేరే లెవెల్లో ఆడుతోంది. సెమీస్‌కు ఈజీగా చేరుకుంటుంది. కానీ నా గత అనుభవాలను బట్టి చెబుతున్నా. ఆ రోజున ఏ టీమ్ బాగా ఆడితే అదే గెలుస్తుంది. ఎవరో ఒకరు మంచి ఇన్నింగ్స్ ఆడి మిమ్మల్ని అప్సెట్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. ODI, T20ల్లో IND డామినెన్స్‌కు రోహిత్ శర్మ కారణమని ‘THE RISE OF THE HITMAN’ బుక్ లాంచ్ ఈవెంట్లో చెప్పారు.
News January 28, 2026
మున్సి’పోల్స్’.. నేటి నుంచి నామినేషన్లు

TG: మున్సిపల్ ఎన్నికల <<18974641>>నామినేషన్ల<<>> ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 30 వరకు కొనసాగనుంది.
నామినేషన్‌కు కావాల్సినవి: నామినేషన్ ఫారం, పుట్టిన తేదీ ధ్రువీకరణ (SSC/ఓటర్ ఐడీ/ఆధార్ జిరాక్స్), కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వుడు స్థానాల్లో), నామినేషన్ డిపాజిట్, సెల్ఫ్ అఫిడవిట్ (ఆస్తులు, విద్యార్హతలు, కేసులు), కొత్త బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, సెల్ఫ్ డిక్లరేషన్, ప్రాపర్టీ నో డ్యూ సర్టిఫికెట్, ఫొటోలు.
News January 28, 2026
OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

తమిళ హీరో కార్తి, కృతి శెట్టి జంటగా నటించిన ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన తమిళ వెర్షన్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఇతర భాషల్లో రిలీజ్ చేయకుండా 2 వారాల్లోనే నేరుగా OTTలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మూవీకి నలన్ కుమారస్వామి డైరెక్టర్.


