News December 10, 2024
ఆ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం

అలహాబాద్ హైకోర్టు జస్టిస్ శేఖర్ యాదవ్ తొలగింపునకు పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయించింది. దేశంలో మెజారిటీ ప్రజల అభీష్టానికి పాలన సాగాలంటూ జడ్జి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఉభయ సభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన బలాన్ని కూడగట్టేందుకు NC ప్రయత్నిస్తోంది. జడ్జి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా నివేదిక కోరింది.
Similar News
News January 8, 2026
VZM: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా బస్సులో ఉన్న సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో సుందరపేట సీహెచ్‌సీకి, డ్రైవర్‌ను కేంద్రాసుపత్రికి తరలించారు.
News January 8, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ రెనెవెబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (<
News January 8, 2026
పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల చిత్రపటాలు

పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.


