News December 10, 2024

హోం మంత్రి అనితకు హైకోర్టులో ఊరట

image

హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్ కేసులో విశాఖ కోర్టులో ఉన్న కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనిత, ఫిర్యాదుదారుడు కోర్టుకు హాజరై రాజీ కుదుర్చుకున్నామని చెప్పడంతో కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70లక్షలు అప్పుతీసుకున్న ఆమె 2018లో చెక్కు ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు.

Similar News

News March 1, 2026

సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల సేకరణ: విశాఖ డీఈవో

image

జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను సేకరించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్ ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. దీనిపై అభ్యంతరాలను 7వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.

News March 1, 2026

విశాఖ: వెంకటాద్రి వంటిల్లు వద్ద యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గేటు సమీపాన వెంకటాద్రి వంటిల్లు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మలుపు తిరిగే సమయంలో ఎలక్ట్రికల్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోలో ఉన్న భార్యాభర్తలు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

News March 1, 2026

రెండో రోజు సెలబ్రిటీ క్రికెట్ పోటీలు ప్రారంభించిన గంటా

image

మధురవాడ ఏసీఏ – వీడీసీఏ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండో రోజు పోటీలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. బలమైన జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ అందరికీ ఆనందాన్ని పంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజుతో ముగుస్తున్న సెలబ్రిటీ క్రికెట్ విశాఖ ప్రజలకు మంచి అనుభూతిని అందించిందన్నారు. టాస్ వేసి పోటీలను ఆరంభించారు.