News December 10, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి కొత్త పోస్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజైంది. ముప్పై రోజుల్లో సినిమా రిలీజవుతుందని తెలియజేస్తూ బైక్‌పై చరణ్ వెళ్తోన్న ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చెర్రీ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే నెల 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ చెర్రీకి జోడీగా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News November 9, 2025
చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.
News November 9, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

<
News November 9, 2025
అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.


