News December 10, 2024
ఒకే ఇంటి నుంచి నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు

ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, టామ్ కరన్‌ల సోదరుడు బెన్ కరన్ అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నారు. జింబాబ్వే తరఫున ఆయన వన్డే జట్టుకు ఎంపికయ్యారు. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం సెలక్టర్లు బెన్‌ను సెలక్ట్ చేశారు. కాగా బెన్ కరన్ తండ్రి కెవిన్ కరన్ కూడా గతంలో జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించారు. కరన్ ఇంటి నుంచి ఇప్పటివరకు మొత్తం నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు వచ్చారు.
Similar News
News November 10, 2025
APPLY NOW: జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మనీలో మెకానిక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇవాళ్టి వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/
News November 10, 2025
మరో బస్సు ప్రమాదం.. 30 మంది సేఫ్

AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుచేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
News November 10, 2025
‘వెంటనే తొలగిస్తున్నాం’.. CEO సహా ఉద్యోగులకు HR మెయిల్!

HR డిపార్ట్‌మెంట్ చేసిన పొరపాటు గురించి ఓ ఉద్యోగి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మా కంపెనీ ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ టూల్‌ను టెస్ట్ చేస్తోంది. లైవ్ మోడ్ నుంచి టెస్ట్ మోడ్‌కు మార్చడాన్ని మర్చిపోయింది. దీంతో ‘మీ చివరి పని దినం వెంటనే అమల్లోకి వస్తుంది’ అని CEO సహా 300 మందికి ఈమెయిల్స్ వచ్చాయి. అయితే తప్పు తెలుసుకుని తర్వాత మరో మెసేజ్ చేసింది. ఎవరినీ తొలగించలేదని చెప్పింది’ అని రెడిట్‌లో రాసుకొచ్చాడు.


