News December 11, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 11, బుధవారం
ఏకాదశి: రా.1.09 గంటలకు
రేవతి: ఉ.11.47 గంటలకు
వర్జ్యం: ఉ.6.11 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.11.38-12.23 గంటల వరకు

Similar News

News January 16, 2026

NABARDలో 162 ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు

image

NABARD 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపు పూర్తి నోటిఫికేషన్ రానుండటంతో పాటు దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. వయసు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీలో 50% మార్కులు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. స్థానిక భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్, లాంగ్వేజీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News January 16, 2026

తొలిసారిగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ

image

TG: రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పొంగులేటి చెప్పారు.

News January 16, 2026

గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుతో 8వేల మందికి ఉపాధి

image

AP: కాకినాడలో CM CBN ప్రారంభించనున్న AM గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ₹90వేల CRతో ఏర్పాటయ్యే ఇది దేశంలో మొదటిది. 8వేల మందికి ఉపాధి కల్పించనుంది. దశలవారీగా 2030కి 1.5 MT గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది. విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ షిప్పింగ్ ఫ్యూయల్‌కు ఇది ఉపకరిస్తుంది. ఇక్కడి నుంచి గ్రీన్ ఎనర్జీ మాలిక్యూల్స్‌ను జర్మనీ, జపాన్, సింగపూర్‌కు ఎగుమతి చేస్తారు.