News December 11, 2024
డిసెంబర్ 11: చరిత్రలో ఈ రోజు

* 1922: సినీ నటుడు దిలీప్ కుమార్ జననం
* 1931: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం
* 1953: UNICEF ఏర్పాటు
* 1969: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జననం
* 1995: హీరోయిన్ నబా నటేష్ జననం
* 2004: MS సుబ్బలక్ష్మీ(ఫొటోలో) మరణం
* 2012: సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ మరణం
* అంతర్జాతీయ పర్వత దినోత్సవం
Similar News
News November 7, 2025
స్మశానాలకు దగ్గర్లో ఇల్లు ఉండవచ్చా?

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్మశానం నుంచి వెలువడే ప్రతికూల తరంగాలు నివాసితులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. ‘దహన సంస్కారాలు జరిగే చోటు నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుదలై పర్యావరణం కాలుష్యమవుతుంది. ఈ గాలి ఆరోగ్యానికి హానికరం. నిరంతరం అశాంతి, నిరాశ భావాలను పెంచుతాయి’ అని సూచిస్తారు. <<-se>>#Vasthu<<>>
News November 7, 2025
అది పాకిస్థాన్ చరిత్రలోనే ఉంది: భారత్

అణ్వాయుధాలను <<18185605>>పరీక్షిస్తున్న<<>>దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. రహస్య, చట్ట విరుద్ధ అణు కార్యక్రమాలు నిర్వహించడం పాక్ చరిత్రలోనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విమర్శించారు. దశాబ్దాలపాటు స్మగ్లింగ్, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు నిర్వహించిందని అన్నారు. ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నామన్నారు.
News November 7, 2025
కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.


