News December 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 9, 2025

ఇదే జోరు కొనసాగితే 2027కి పోలవరం పూర్తి: అతుల్ జైన్

image

AP: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు జరుగుతున్నాయని పీపీఏ సీఈవో అతుల్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌లో పనులను, టెస్టింగ్ ల్యాబ్‌ను ఆయన పరిశీలించారు. అలాగే నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు నిధుల ఢోకా లేదని, ఇదే జోరు కొనసాగితే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు.

News November 9, 2025

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 110 పోస్టులు

image

<>BOB<<>> క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ వివిధ జోన్లలో 110 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఇ మెయిల్ careers@bobcaps.in ద్వారా అప్లై చేసుకోవాలి.

News November 9, 2025

మనిషికి సంస్కారం ఎందుకు ఉండాలి? అదెలా వస్తుంది?

image

శరీర మలినాన్ని స్నానం తొలగించినట్లే, జీవులకు అంటిన అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించి, సద్గుణాలు ప్రసాదించేదే నిజమైన సంస్కారం. ఈ కర్మ బాహ్య శుద్ధి కాదు, ఆత్మ శుద్ధి. మనస్సుకు, బుద్ధికి జ్ఞానంతో సంస్కారం చేయడం ద్వారానే మానవుడు దివ్యత్వాన్ని పొందగలడు. ఆచారాలు, సత్కర్మల ద్వారా మనసును సంస్కరించుకుని, ఉత్తమ జీవనం సాగించడమే మన లక్ష్యం. సంస్కారాన్ని తల్లిదండ్రులు, వేదాల పఠనంతో పొందవచ్చు. <<-se>>#VedikVibes<<>>