News December 11, 2024
ఓరియంటేషన్ సెషన్ బహిష్కరిస్తున్నాం: KTR

TG: నేటి నుంచి జరగనున్న MLAల ఓరియంటేషన్ సెషన్‌ను BRS బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రకటించారు. ‘శాసనసభ ప్రారంభానికి ముందే మమ్మల్ని అరెస్ట్ చేసి మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. మా పార్టీ MLAల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోలేదు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. ఆయన వ్యవహార శైలికి నిరసనగా సెషన్ బహిష్కరిస్తున్నాం’ అని KTR పేర్కొన్నారు.
Similar News
News January 15, 2026
కనుమ రోజున ప్రయాణాలు చేయవద్దా? దీని వెనుక ఉద్దేశం?

కనుమ రోజున ప్రయాణాలు చేయొద్దనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. ఈ రోజును పశువుల పండుగగా జరుపుతారు. పంటల సాగులో సాయపడిన పశువులను పూజిస్తారు. అయితే పూర్వం ఎడ్ల బండ్లపై ప్రయాణాలు చేసే వారు కాబట్టి ఈ ఒక్కరోజైనా ఎద్దులను కష్టపెట్టొద్దనే ఉద్దేశంతో ప్రయాణాలు వద్దని చెప్పేవారని పండితులు గుర్తుచేస్తున్నారు. కాగా ప్రస్తుత కాలంలో ఈ నియమం వల్ల కుటుంబమంతా కలిసి గడిపేందుకు ఎక్కువ సమయం ఉంటుందంటున్నారు.
News January 15, 2026
సూర్యపై కామెంట్స్.. నటిపై రూ.100 కోట్ల దావా

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తరచూ మెసేజ్ చేస్తున్నాడన్న నటి <<18721618>>ఖుషీ<<>> ముఖర్జీపై SKY అభిమాని అన్సారీ చర్యలకు దిగారు. నటి వ్యాఖ్యలను ఖండిస్తూ రూ.100 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేశారు. నటికి సూర్య కుమార్ మెసేజులు చేశారనడం పూర్తిగా తప్పని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఖుషీకి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.
News January 15, 2026
‘సెంటిమెంట్’ను నమ్ముకున్న ‘బలగం’ వేణు!

కమెడియన్ నుంచి దర్శకుడిగా మారి ‘బలగం’ సినిమాతో హిట్ కొట్టిన వేణు మరోసారి జనాల ఎమోషన్‌ను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ‘బలగం’లో ఓ ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని కథగా తీసుకొని జనాలను థియేటర్లకు రప్పించడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. తాజాగా విడుదలైన ‘ఎల్లమ్మ’ <<18865101>>గ్లింప్స్<<>> చూస్తే అదే ఫార్ములా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఈసారి దైవం-ఆచారం చుట్టూ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. మీకు గ్లింప్స్ ఎలా అనిపించింది?


