News December 11, 2024
మైనార్టీలపై దాడులు.. బంగ్లాదేశ్ కీలక ప్రకటన
బంగ్లాలో హిందువులు, మైనార్టీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 5 నుంచి అక్టోబర్ 22 వరకు 88 మతపరమైన హింసాత్మక దాడులు జరిగినట్లు వెల్లడించింది. 70మందిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగిన దాడులపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంది. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లా తాత్కాలిక సారథి యూనస్‌ను కలిసిన నేపథ్యంలో వివరాలు వెల్లడించారు.
Similar News
News December 27, 2024
కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నిన్నటితో గడువు ముగియగా నేడు కోర్టులో విచారణ జరగనుంది. కాగా రిమాండ్ విధించిన మరుసటి రోజే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రిమాండ్ పూర్తి ప్రాసెస్‌లో భాగంగా ఐకాన్ స్టార్ కోర్టుకు హాజరుకానున్నారు.
News December 27, 2024
ఇవాళ కాలేజీలకు సెలవు
TG: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా రాష్ట్రంలోని కాలేజీలకు కూడా సెలవు ఇచ్చారు. ఈమేరకు JNTU, కాకతీయ, ఓయూ తదితర యూనివర్సిటీలు ప్రకటన చేశాయి. ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఇవాళ జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు ఏపీలో ఎలాంటి సెలవు ప్రకటించలేదు.
News December 27, 2024
Stock Markets: లాభాల్లో పరుగులు..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న మంచి స్టాక్స్‌ను కొంటున్నారు. సెన్సెక్స్ 78,896 (+424), నిఫ్టీ 23,858 (+108) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బ్యాంకు, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు జోరుమీదున్నాయి. BAJAJAUTO, TATAMOTORS, DRREDDY, EICHERMOT, INDUSIND టాప్ గెయినర్స్.