News December 11, 2024
మూడోదైనా గెలుస్తారా?
వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఇవాళ ఉదయం 9.50 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయిన ఇండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమవుతున్న టీమ్ ఇండియా ప్లేయర్లు ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News December 27, 2024
షాకింగ్: మీ సేవ పేరుతో నకిలీ వెబ్‌సైట్
TG: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్‌పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్‌ను బ్లాక్ చేసింది.
News December 27, 2024
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీకి రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News December 27, 2024
నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!
మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయనకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. నిజమైన భారత రత్నం ఇతడేనని, ఈయనకు భారత అత్యున్నత పురస్కారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు సార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తుచేస్తున్నారు. సింగ్‌కు 1987లోనే పద్మవిభూషణ్ వరించింది.