News December 11, 2024
మెహుల్ చోక్సీ ఆస్తుల వేలం!

ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీ ఆస్తులు వేలం వేయడానికి ఈడీ సిద్ధమైంది. అతడికి చెందిన రూ.2,500కోట్లు విలువైన సొత్తును అక్రమాస్తుల నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. కాగా, ఈ ఆస్తుల వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని PNB, ICICI బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఈడీ కోర్టు ఇప్పటికే ఆదేశించింది. తప్పుడు పత్రాలతో PNBకి రూ.13వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెహుల్ చోక్సీ విదేశాలకు పరారయ్యారు.
Similar News
News September 22, 2025
నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం

సీనియర్ నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి గీతా రాధ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు రాధిక తెలిపారు. చివరి చూపుల కోసం ఆమె భౌతికకాయాన్ని పోయెస్ గార్డెన్‌లో ఉంచారు. రేపు (సెప్టెంబర్ 22) చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
News September 22, 2025
రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్న సీఎం!

TG: సింగరేణి ఉద్యోగులకు CM రేవంత్ రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్నట్లు సమాచారం. శాశ్వత ఉద్యోగులకు రూ. 1.90 లక్షలు, తాత్కాలిక ఉద్యోగులకు రూ. 5వేల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. అలాగే సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా బొగ్గు అమ్మకాలు, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది.
News September 22, 2025
US H-1Bకి పోటీగా చైనా ‘K వీసా’!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించేందుకు చైనా కొత్తగా ‘K వీసా’ను ప్రవేశపెట్టింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ & మ్యాథమెటిక్స్ (STEM) రంగాల్లో స్కిల్డ్ మ్యాన్‌ఫోర్స్ కోసం OCT 1 నుంచి ఈ వీసాను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నిపుణులు దీన్ని US H-1B వీసాకు పోటీగా అభివర్ణిస్తున్నారు. వీసా ఫీజును US లక్ష డాలర్లకు పెంచడం చైనాకు కలిసొచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.