News December 11, 2024

బంగ్లా హిందువులకు మద్దతుగా కెనడాలో ఆందోళన

image

బంగ్లాదేశ్ హిందువులకు కెనడా హిందువులు అండగా నిలిచారు. ఆ దేశంలో మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ ఒట్టావాలోని బంగ్లా హైకమిషన్ ముందు ఆందోళన చేపట్టారు. ‘షేమ్ షేమ్ బంగ్లాదేశ్’, ‘మహ్మద్ యూనస్ కూనీకోర్’, ‘హిందూలైవ్స్ మ్యాటర్’, ‘హిందువుల ఊచకోత ఆపండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హిందూ స్త్రీలు, పిల్లలను రేప్ చేస్తున్నారు. గతంలో పాక్, అఫ్గాన్‌లో జరిగినట్టే బంగ్లాలోనూ జరుగుతోంది’ అని ఒకరు వాపోయారు.

Similar News

News September 21, 2025

ఇజ్రాయెల్ దాడులు.. ఒక్క రోజే 91 మంది మృతి!

image

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక్క రోజే 91 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇళ్లు, షెల్టర్లు, వాహనాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. పేలుడు పదార్థాలు నింపిన రోబోలను ఇజ్రాయెల్ దళాలు వాడుతున్నట్లు పేర్కొంది. గత 2 వారాల్లో 20 టవర్ బ్లాక్‌లపై అటాక్స్ జరిగాయని, లక్షలాది మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. అటు యుద్ధం ఆపేయాలంటూ వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలకు దిగారు.

News September 21, 2025

సంతానోత్పత్తిని పెంచే సీడ్ సైక్లింగ్‌

image

మహిళల సంతానోత్పత్తిలో హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని సమతుల్యంగా ఉంచడానికి సీడ్ సైక్లింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీడ్ సైక్లింగ్ అనేది అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి విత్తనాలను ఒక ప్రత్యేక విధానంలో తినే ఒక ప్రకృతి వైద్య చికిత్స. ఇది PMS లక్షణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. వీటిని సలాడ్లు, స్మూతీల్లో వేసుకొని తినొచ్చు.

News September 21, 2025

సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే?

image

సీడ్ సైక్లింగ్‌లో పీరియడ్ 1-14 రోజు వరకు రోజుకు అవిసె, గుమ్మడికాయ విత్తనాలను తీసుకోవాలి. 14వరోజు నుంచి పీరియడ్స్ మొదటి రోజు వరకు పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలను తీసుకోవాలి. రెగ్యులర్ పీరియడ్‌‌లో మొదటి 14 రోజులు ఫోలిక్యులర్ దశ, తర్వాత లూటియల్ దశ ఉంటాయి. ఆ సమయానికి తగ్గట్లు సీడ్స్ తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు సమతుల్యతతో ఉంటాయి. ఇవి గర్భం దాల్చడంలో సహాయపడతాయి.