News December 11, 2024
హిందువులు సహా మైనారిటీలపై 88 దాడులు: బంగ్లాదేశ్

హిందువులు సహా మైనారిటీలపై మత హింస కేసుల వివరాలను బంగ్లాదేశ్ వెల్లడించింది. ఆగస్టులో షేక్ హసీనా వెళ్లినప్పటి నుంచి 88 హింసాత్మక ఘటనలు జరిగాయంది. ఈ కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్టు యూనస్ ప్రెస్ సెక్రటరీ ఆలమ్ తెలిపారు. సునమ్ గంజ్, గాజీపూర్, ఇతర ప్రాంతాల దాడుల్లో అరెస్టులు కొనసాగుతాయన్నారు. దాడులపై ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఆందోళన వ్యక్తంచేసిన మరుసటి రోజే వివరాలు వెల్లడించడం గమనార్హం.
Similar News
News September 21, 2025
మరికొన్ని గంటల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత జట్టు అంచనా!

ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్vsపాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడగా మ్యాచ్ ఆడటంపై అనిశ్చితి నెలకొనడంతో అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణా వచ్చే ఛాన్స్ ఉందని NDTV తెలిపింది.
టీమ్ అంచనా: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్
News September 21, 2025
అర్ధరాత్రి నుంచి ధరలు తగ్గే వస్తువులు ఇవే..

దేశవ్యాప్తంగా ఈ అర్ధరాత్రి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇక నుంచి 5%, 18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్నింటిని 40% ట్యాక్స్ లిస్టులో చేర్చారు. దాదాపు 200కు పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆహారం, పాల ఉత్పత్తులు, FMCG, ఎలక్ట్రానిక్స్, వాహనాల ధరలు పడిపోనున్నాయి. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయో ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఇక్కడ <
News September 21, 2025
అత్తా కోడళ్లకు ఎందుకు పడదంటే?

అత్తాకోడళ్లంటే ఒకే ఒరలో రెండు కత్తులని అందరూ భావిస్తారు. దీనికి కారణాలు అనేకం. భర్త తన సొంతం అని కోడలు అనుకుంటుంది. కొడుకును తన దగ్గర్నుంచి లాక్కున్నారని తల్లి అనుకుంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండదు. సమాజం కోడలు ఎలా ఉండాలి అనేది ఒక ఫ్రేమ్ వర్క్‌లో చూస్తుంది. పోటీ తత్త్వం, అసూయ, ప్రాథమిక కారణాలు అని సైకాలజిస్ట్‌లు అంటున్నారు. అత్తా కోడళ్ల మధ్య ఓపెన్‌నెస్ ఉంటే చాలా సమస్యలు సమసిపోతాయని సూచిస్తున్నారు.