News December 11, 2024

నో.. నో: రాహుల్‌కు షాకిచ్చిన కేజ్రీవాల్

image

కాంగ్రెస్‌, రాహుల్ గాంధీకి ఆమ్‌ఆద్మీ షాకిచ్చింది. ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. సొంత బలంతోనే పోరాడతామని వెల్లడించింది. ‘ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తు తుదిదశకు చేరుకుంది. కాంగ్రెస్ 15, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు 1-2, మిగిలిన వాటిలో ఆప్ పోటీచేస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం’ అంటూ ANI చేసిన ట్వీటుకు అరవింద్ కేజ్రీవాల్ పైవిధంగా బదులిచ్చారు.

Similar News

News November 10, 2025

వనపర్తి: రేటినో స్కోపి పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం

image

వనపర్తి జిల్లాలో వైద్య శాఖ ద్వారా గుర్తించిన మధుమేహ వ్యాధిగ్రస్తుల ప్రతి ఒక్కరికి రేటినో స్కోపి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రెటినోపతి వైద్య పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభించి 100 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.  

News November 10, 2025

కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చిన UIDAI.. ఫీచర్స్ ఇవే

image

కొత్త ఆధార్ యాప్‌ను UIDAI తీసుకొచ్చింది. ఆధార్ వివరాలను ఫోన్‌లో స్టోర్ చేసుకునేందుకు, ఇతరులతో పంచుకునేందుకు రూపొందించినట్లు Xలో పేర్కొంది. ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్‌లోని ఎంపిక చేసిన వివరాలనే షేర్ చేసుకునే సదుపాయం ఇందులో ఉండటం విశేషం. మిగతా సమాచారం హైడ్ చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ కూడా ఉంది.

News November 10, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

☛ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజహరుద్దీన్.. సచివాలయంలో ప్రార్థనల అనంతరం బాధ్యతలు
☛ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్.. పాల్గొన్న హరీశ్ రావు, తలసాని
☛ వరద ప్రవాహంతో నిలిచిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం దర్శనాలు పునఃప్రారంభం