News December 11, 2024
రేవతి మృతితో మాకేం సంబంధం?: సంధ్య థియేటర్ ఓనర్

TG: ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు. అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
ఆస్కార్ బరిలో భారత్ నుంచి మరిన్ని చిత్రాలు

ఈ ఏడాది ఆస్కార్ రేసులో తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో పోటీ పడనుంది. ఇక హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన <<18806607>>కాంతార<<>>: చాప్టర్-1, మహావతార్ నరసింహ చిత్రాలు జనరల్ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. ఇవి ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి విభాగాల్లో సెలక్ట్ అయ్యాయి. అలాగే తన్వీ ది గ్రేట్, సిస్టర్ మిడ్‌నైట్, హోమ్‌బౌండ్ సినిమాలు ఉన్నాయి.
News January 10, 2026
ఇకపై Xలో అవి క్రియేట్ చేయలేరు!

గ్రోక్‌ను ఎడాపెడా వాడేస్తున్న యూజర్లకు ‘X’ షాక్ ఇచ్చింది. అసభ్య, అశ్లీల కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం <<18795355>>సీరియస్<<>> అయిన విషయం తెలిసిందే. దీంతో సదరు సంస్థ పలు పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కేవలం సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ Grokను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని యూజర్లను హెచ్చరించారు.
News January 10, 2026
శంఖం పూలకు పెరుగుతున్న డిమాండ్

ఇప్పటివరకు పెరట్లో పూసే మొక్కగా మాత్రమే చూసిన శంఖం పూలు ఇప్పుడు రైతులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. సహజ రంగులు, హెర్బల్ టీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఈ పూల సాగు భారీగా పెరుగుతోంది. అస్సాం, UP, WB రాష్ట్రాల్లో మహిళా రైతులు ఈ పంటతో మంచి లాభాలు పొందుతున్నారు. టీ, డై తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్న వీటికి అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.


