News December 11, 2024
ఇంకా జోరు తగ్గని ‘దేవర’

ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ విడుదలై మూడు నెలలు దాటినా జోరు కొనసాగిస్తోంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ వేదికపై అత్యధికంగా వీక్షించిన రెండో దక్షిణాది చిత్రంగా నిలిచింది. వరుసగా 5వారాల పాటు టాప్ 10లో ట్రెండ్ అవుతోందని దేవర మూవీ టీమ్ తెలిపింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్‌వైడ్ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
Similar News
News September 13, 2025
ALERT: రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాబోయే 24 గంటల్లో TGలోని ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, RR జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, NZB, కొత్తగూడెం, KMM, నల్గొండ, SRPT, HYD, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. APలోని శ్రీకాకుళం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, KNL, NDL జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
News September 13, 2025
IBలో 394 జాబ్స్.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. SC, STలకు ఎగ్జామ్ ఫీజు లేదు. జనరల్, ఓబీసీలు రూ.500 చెల్లించాలి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది.<
News September 13, 2025
రేపే INDvsPAK.. మ్యాచ్ చూస్తారా?

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటే క్రేజే వేరు. కొందరైతే ఎంత ఖర్చయినా సరే విదేశాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తుంటారు. కానీ పహల్గామ్ అటాక్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాయాదుల పోరుపై చాలామంది ఇంట్రెస్టే చూపట్లేదు. కొందరేమో మ్యాచ్‌ను మ్యాచ్‌లా చూడాలంటున్నారు. SMలో ఇంత రచ్చ అవుతున్నా BCCI & ప్లేయర్లు స్పందించలేదు. ఇంతకీ రేపు జరిగే మ్యాచ్‌ను మీరు వీక్షిస్తారా? బహిష్కరిస్తారా? కామెంట్ చేయండి.