News December 11, 2024

HYD: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట‌లో మరో మలుపు!

image

పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చిందన్నారు. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదని, ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారన్నారు. అయినా తమ బాధ్యతగా బందోబస్తు కల్పించామని, అలాంటి తమపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Similar News

News December 14, 2024

చిలుకూరులో CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు

image

చేవెళ్ల నియోజకవర్గంలో CM రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం చిలుకూరు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య ఆయనకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. CM రాకతో మొయినాబాద్ మండల వ్యాప్తంగా, సభ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

News December 13, 2024

HYD: అగ్నివీర్ల ట్రైనింగ్‌పై ప్రశంసలు

image

సికింద్రాబాద్ EME కేంద్రాన్ని సీనియర్ కల్నల్ కమాండెంట్ సిదాన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్‌లను పరిశీలించారు. అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, బేసిక్ స్టాండర్డ్స్ మిలిటరీ ట్రైనింగ్, అగ్ని వీర్లకు అందిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో వివిధ స్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.

News December 13, 2024

HYD: Xలో అల్లు అర్జున్ బెయిల్ ట్రెండింగ్..!

image

HYDలో ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ కాగా తాజాగా హైకోర్టు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు పొందిన నటుడి అరెస్ట్, బెయిల్ ట్విట్టర్ X‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. HYDలో హీరో అల్లు అర్జున్ అరెస్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపింది.