News December 11, 2024

ఆస్ట్రేలియా భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 298/6 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆల్‌రౌండర్ సదర్లాండ్ (110) సెంచరీతో దుమ్మురేపారు. ఆ జట్టు 78/4తో కష్టాల్లో ఉన్నప్పుడు సదర్లాండ్ క్రీజులో అడుగుపెట్టారు. ఆ తర్వాత భారత బౌలర్లను ఎడా పెడా బాదేస్తూ శతకం పూర్తి చేసుకున్నారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

Similar News

News April 7, 2026

రాజధానిగా అమరావతి.. ముఖ్యమైన తేదీలివే!

image

➤ మార్చి 28, 2026: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.
➤ ఏప్రిల్ 1: లోక్‌సభలో అమరావతి బిల్లుపై 2గంటలకు పైగా చర్చ.. ఆపై ఆమోదం
➤ ఏప్రిల్ 2: రాజ్యసభలో గంటకు పైగా చర్చ.. అనంతరం బిల్లుకు ఆమోదం
➤ ఏప్రిల్ 6: రాజ్యసభ నుంచి రాష్ట్రపతి భవన్‌కు బిల్లు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేయడంతో అమరావతికి చట్టబద్ధత. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

News April 6, 2026

BREAKING: ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్ విడుదల

image

ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొంది. CRDA-2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసింది.

News April 6, 2026

జూన్ నుంచి మరింత తక్కువ ధరకు ఇన్సూరెన్స్?

image

IRDAI డెవలప్ చేసిన బీమా సుగమ్ పోర్టల్‌లో జూన్ నుంచి జీరో కమీషన్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లతో పనిలేకుండా ఇన్సూరెన్స్‌ సంస్థలు ఈ పోర్టల్‌కు కేవలం 5-7% ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా ప్రీమియమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. JUNలో వెహికల్ ఇన్సూరెన్స్ లాంచ్ కానుంది. ఇక AUGలో హెల్త్ ఇన్సూరెన్స్, SEPలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.