News December 11, 2024
మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట

ఢిల్లీ మాజీ Dy.CM మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. లిక్కర్ పాలసీ కేసులో Aug 9న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సోమ, గురువారాల్లో విచారణాధికారి ముందు హాజరుకావాలని SC గతంలో ఆదేశించింది. అయితే ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇవ్వాలని సిసోడియా కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. వారంలో 2 రోజులు హాజరవ్వాల్సిన అవసరం లేదని, ట్రయల్ సందర్భంగా కచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలంది.
Similar News
News September 21, 2025
వరిలో ఎలుకల నివారణకు ఇలా చేయండి

* బ్రోమోడయోలిన్ మందు 10-15 గ్రా.(పిడికెడు నూకలు, కాస్త నూనెతో కలుపుకుని) పొట్లాలుగా కట్టి కన్నానికి ఒకటి చొప్పున పెట్టాలి.
* ఈ మందును 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్టుకోవాలి.
* కన్నాల దగ్గర పొగబారించుకోవడం ద్వారా ఎలుకలను తరిమివేయవచ్చు.
* ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలు పెట్టుకోవాలి.
* ఎలుకలను నిర్మూలించడానికి రైతులు సామూహికంగా చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది.
<<-se>>#PADDY<<>>
News September 21, 2025
13,217పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు

<
News September 21, 2025
ఏసీల ధరలు రూ.4,500 వరకు తగ్గింపు

GST శ్లాబుల మార్పుతో ఏసీలు, డిష్ వాషర్ల ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఏసీలపై సగటున రూ.4,500, డిష్ వాషర్లపై రూ.8వేల వరకు రేట్లు తగ్గిస్తున్నట్లు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానాసోనిక్, Haier తదితర కంపెనీలు ప్రకటించాయి. LG 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర రూ.3,600 తగ్గింది. డైకిన్ 1 టన్ 3 స్టార్ ఏసీ ధర రూ.50,700 నుంచి రూ.46,730కి తగ్గింది. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.