News December 11, 2024
కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు వన్ వే స్పెషల్ ట్రైన్

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB) – హౌరా(HWH)(నం.06585) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 14న ఉదయం 10.15 గంటలకు SMVBలో బయలుదేరే ఈ ట్రైన్ అదే రోజు రాత్రి 10.10 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 15వ తేదీన రాత్రి 9.45 గంటలకు HWH చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.
Similar News
News July 4, 2025
నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో CSR నిధులు ఉన్నప్పటికీ మైక్రో వాటర్ ఫిల్టర్‌ల నిర్మాణంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని RWS అధికారులను కలెక్టర్ బాలాజీ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో గ్రామీణ నీటి సరఫరా ఫిల్టర్‌లు, అంగన్వాడీ కేంద్రాల్లో వర్షపు నీటి నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. గ్రామాల్లో మైక్రో వాటర్ ఫిల్టర్‌లను నిర్మించడంలో RWS ఇంజినీర్‌లు శ్రద్ద చూపడం లేదని కలెక్టర్ అన్నారు.
News July 4, 2025
మహనీయుల సేవలను స్మరించుకోవాలి: కలెక్టర్

మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో
శుక్రవారం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఇరువురి మహనీయుల చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
News May 7, 2025
కృష్ణా: మే 11న ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు

PM సూర్యఘర్ పథకం మంజూరు కోసం జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది ఆదర్శ గ్రామాల్లో మే 11వ తేదీన ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో CPDCL ఆధ్వర్యంలో PM సూర్య ఘర్ పథకంపై అధికారులు, బ్యాంకర్లకు ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి పలు సూచనలు చేశారు.