News December 11, 2024
రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్: వైయస్ జగన్

జమ్మూలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య రియల్ హీరో అని మాజీ సీఎం జగన్ కొనియాడారు. సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్‌లు 30 మందిని కాపాడడం స్ఫూర్తిదాయకమని అన్నారు. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’లో పోస్టు చేశారు.
Similar News
News January 12, 2026
ప్రకాశం జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

ఒంగోలు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటు చేశారు.

News January 11, 2026
ప్రకాశం: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటుచేశారు.