News December 11, 2024

రూ.1,000 కోట్లు దాటేసిన ‘పుష్ప-2’

image

బాక్సాఫీసుపై అల్లు అర్జున్ ‘పుష్ప-2’ దండయాత్ర కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,002 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. బాక్సాఫీసు వద్ద సరికొత్త చరిత్రను లిఖించిందని పేర్కొంది. దీంతో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా నిలిచిందని వెల్లడించింది. కమర్షియల్ సినిమాకు దర్శకుడు సుకుమార్ కొత్త అర్థం చెప్పారని పేర్కొంది.

Similar News

News March 10, 2026

నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

image

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.

News March 10, 2026

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. వారంలో షెడ్యూల్?

image

అస్సాం, కేరళ, WB, TN, పుదుచ్చేరి(UT)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. EC వారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం CEC జ్ఞానేశ్ కుమార్ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. స్థానిక పండుగలను పరిగణనలోకి తీసుకోవాలని పలు పార్టీలు ECకి విజ్ఞప్తి చేశాయి. కాగా బెంగాల్‌లో ఎన్నికలను రెండు దశల్లోనే పూర్తి చేయాలని TMC, BJP, INC, CPM, AAP నేతలు కోరారు.

News March 10, 2026

ఇండియా వల్ల క్రికెట్ భ్రష్టుపట్టింది: అక్తర్ అక్కసు

image

భారత్ T20WC గెలవడంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఆధిపత్యం వల్ల ఆట భ్రష్టుపట్టిందని అక్కసు వెళ్లగక్కారు. ‘ఓ రిచ్ కిడ్ తన పక్కనున్న పేదపిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం అన్నట్లుగా ఉంది ఇండియా వ్యవహారం’ అని విమర్శించారు. ఫైనల్‌కి ముందు కూడా ‘క్రికెట్ మంచి కోసం న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఆయనపై ఇండియన్ ఫ్యాన్స్‌ SMలో ఫైర్ అవుతున్నారు.