News December 11, 2024
ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలి: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు.
Similar News
News February 5, 2025
WGL: సమగ్ర సమాచారంతో బడ్జెట్ రూపకల్పన
సమగ్ర సమాచారంతో బడ్జెట్‌కు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు. బడ్జెట్ 2025-26 రూపకల్పనపై వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్లో రూపొందించడంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అందరి సహకారంతో బడ్జెట్ రూపొందించాలని, మున్సిపల్ చట్టం-2019 ప్రకారం బడ్జెట్ మొత్తం నుంచి 10% గ్రీన్ బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు.
News February 5, 2025
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. గీసుకొండ మండలం వంచనగిరిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వసతి గృహానికి తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచికరంగా లేదని, గుడ్లు ఉడకని అందిస్తున్నారని తెలిపారు.
News February 5, 2025
MHBD: వైద్యం వికటించి యువకుడు మృతి
తొర్రూరు మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాలు.. వైద్యం వికటించి సిద్ధూ(16) మృతి చెందాడు. జలుబు వస్తుందని ఆసుపత్రికి వెళ్తే ఇంజెక్షన్ వేశారని, ఆ వెంటనే సిద్దు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో ఆస్పత్రిలోనే ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.