News December 11, 2024

జియో కొత్త ప్లాన్.. అదిరిపోయే బెనిఫిట్స్

image

న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.2025తో రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్‌లో 200 రోజుల పాటు రోజుకు 2.5GB ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMSలు చేసుకోవచ్చు. దీనికి తోడుగా రూ.2150 విలువైన(రూ.500 అజియో, ఈజ్ మై ట్రిప్ రూ.1500, స్విగ్గీ రూ.150) కూపన్లను అందిస్తోంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 11, 2025 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది.

Similar News

News January 20, 2026

షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

image

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

News January 20, 2026

NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NIT <<>>వరంగల్ 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

News January 20, 2026

పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు: హైకోర్టు

image

TG: చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని, బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం లాంటివి చేయొద్దని పోలీసులను ఆదేశించింది. వాహనదారుడు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని సూచించింది. లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.