News December 11, 2024

జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా క్రిస్మస్ వేడుకలు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని SPR హిల్స్‌లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆద్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. మంత్రి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన సీఎన్ రెడ్డిని మంత్రి అభినందించారు.

Similar News

News January 16, 2026

హైదరాబాద్‌లో ఆదివారం రెడీనా?

image

ఆదివారం పొద్దున్నే నిద్రలేచి, సైకిల్ ఎక్కి గాలిలో దూసుకెళ్లడానికి మీరు సిద్ధమా?. JAN 18న ఉదయం 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో 57వ ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ రచ్చ జరగబోతోంది. “ఫిట్‌నెస్ కా డోస్.. ఆధా ఘంటా రోజ్” అంటూ పుల్లెల గోపీచంద్, దీప్తి జీవంజి వంటి దిగ్గజాలతో కలిసి 6 కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగుతుంది.

News January 16, 2026

ఇది HYD మెట్రో ప్రయాణికుల కోసం!

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు విజ్ఞప్తి. L&T మెట్రో రైల్ కొత్తగా సర్వే చేస్తోంది. పై ఫొటోలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చింది. దీని వలన ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేయడానికి సాయం చేస్తుందని పేర్కొంది. నిత్యం మెట్రోలో ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.

News January 16, 2026

హైదరాబాద్ TIMS.. హెల్త్ హబ్‌ కోసమే! (1)

image

హైదరాబాద్ నగరాన్ని హెల్త్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఏప్రిల్ 2022లో ఈ మెగా ప్రాజెక్టుకు పునాది పడింది. నగరం నలువైపులా (సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్, గచ్చిబౌలి) సుమారు రూ.4,400 కోట్లతో నిర్మిస్తున్న 4 అత్యాధునిక ఆసుపత్రుల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, అధికారం మారడం, నిధుల విడుదల, పరికరాల సేకరణలో జాప్యం వల్ల ఈ ప్రాజెక్టు గడువులు నిరంతరం మారుతూ వస్తున్నాయి.