News December 11, 2024
SHOCKING: ప్రపంచంపైకి మరో మహమ్మారి?

కరోనా మహమ్మారి ఎలాంటి విధ్వంసం సృష్టించిందో చూశాం. చైనాలోని ల్యాబ్ నుంచి ఆ వైరస్ లీకైందన్న ఆరోపణలున్నాయి. అదే తరహాలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదకరమైన పలు వైరస్‌లు మిస్ కావడం కలకలం రేపుతోంది. హెండ్రా వైరస్, లిస్సా వైరస్, హంటా వైరస్ వంటివి వాటిలో ఉన్నాయని ఫాక్స్ న్యూస్ తెలిపింది. దీంతో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News January 15, 2026
విమానాలు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

నిరసనల కారణంగా ఇరాన్ <<18861323>>గగనతలాన్ని<<>> మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో ఎయిరిండియా, ఇండిగో సహా భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. కొన్ని అంతర్జాతీయ విమానాలను దారిమళ్లిస్తున్నట్లు, మరికొన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మార్పులు, అప్డేట్ల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లను పరిశీలించాలని కోరాయి. మరోవైపు ఇప్పటికే కేంద్రం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది.
News January 15, 2026
కనుమ నాడు గోవులకు పూజ ఎందుకు చేస్తారు?

కనుమ అంటేనే పశువుల పండుగ. అవి ఏడాదంతా పొలం పనుల్లో రైతుకు చేదోడువాదోడుగా ఉంటాయి. పంట చేతికి రావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు కృతజ్ఞతగా నేడు వాటిని పూజిస్తాం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలురను రక్షించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గోపూజ సంప్రదాయం మొదలైంది. ఆవును జంతువుగా మాత్రమే కాకుండా ప్రకృతికి, జీవనాధారానికి ప్రతీకగా భావిస్తారు. ఆవును గౌరవించడం మన సంస్కృతిలో భాగం.
News January 15, 2026
అరటి సాగు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.


