News December 12, 2024
4 పంచాయతీలకు నేషనల్ అవార్డులు
AP: రాష్ట్రంలోని 4 పంచాయతీలకు నేషనల్ అవార్డులొచ్చాయి. పలు కేటగిరీల్లో బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. ఆరోగ్యకర కేటగిరీలో చిత్తూరు(D) బొమ్మసముద్రం, పచ్చదనం-పరిశుభ్రత కేటగిరీలో అనకాపల్లి(D) తగరంపూడికి, సంతృప్తికర తాగునీరు కేటగిరీలో అనకాపల్లి(D) న్యాయంపూడికి, సామాజిక భద్రతలో ఎన్టీఆర్(D) ముప్పాళ్ల పంచాయతీలకు అవార్డులు వరించాయి.
Similar News
News February 5, 2025
ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.
News February 5, 2025
SWIGGY నికర నష్టం రూ.799 కోట్లు
FY25 మూడో త్రైమాసికంలో ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ స్విగ్గీ నష్టాలు మరింత పెరిగాయి. గతేడాది ఇదే టైంలో రూ.574 కోట్లు నష్టం చవిచూడగా ఈసారి నికర నష్టం రూ.799 కోట్లకు చేరుకుంది. FY25 Q3లో రూ.3,700 కోట్లుగా ఉన్న ఖర్చులు ఇప్పుడు రూ.4,898 కోట్లకు పెరగడమే నష్టాలకు కారణమని సమాచారం. ఆపరేషన్స్ రెవెన్యూ మాత్రం 31% వృద్ధిరేటుతో రూ.3049 కోట్ల నుంచి రూ.3993 కోట్లకు పెరిగింది. టాప్‌లైన్ సైతం 11% గ్రోత్ నమోదు చేసింది.
News February 5, 2025
‘మిర్రర్ హ్యాండ్’ సిండ్రోమ్ గురించి తెలుసా?
ఎవరి చేయికైనా ఐదు వేళ్లు ఉండటం సహజం. కొందరికి 6 కూడా ఉంటుంటాయి. అయితే, ‘మిర్రర్ హ్యాండ్’ సిండ్రోమ్ సోకిన వారికి చేతికి ఇరువైపులా ఒకే విధంగా వేళ్లుంటాయి. ఈ అరుదైన వ్యాధి వల్ల ఒక్క హ్యాండ్‌కు 8 ఫింగర్స్ ఉంటాయి. బొటనవేలు ఉండదు. దీనికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ అల్ట్రాసౌండ్ ద్వారా జననానికి ముందే గుర్తించవచ్చు. దీనిని శస్త్రచికిత్స ద్వారా నార్మల్‌గా మార్చేయవచ్చు.