News December 12, 2024

నెల్లూరు: సౌదీలో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు 

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులకు సౌదీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు నెల్లూరు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ పేర్కొన్నారు. అభ్యర్థులు 18-40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండి, ఏదైనా ఆస్పత్రిలో 18 నెలలు పని చేసిన అనుభవం ఉండాలన్నారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.78- రూ.89 వేలు వేతనం లభిస్తుందన్నారు.

Similar News

News January 14, 2025

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం

image

సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

News January 14, 2025

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం

image

సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

News January 13, 2025

మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

image

మనుబోలు మండలం, కాగితాలపూరు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి గూడూరు వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.