News December 12, 2024

అనంతసాగరం: తండ్రి, కుమారుల గొడవ.. కొడుకు మృతి

image

అనంతసాగరం మండలం ఇనగలూరులో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొడుకు మృతి చెందాడు. కొడుకు మస్తాన్ రోజు మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. దీనితో తండ్రి నబ్బీసాహెబ్ మందలించాడు. ఈ క్రమంలో తండ్రి పై కర్రతో దాడి చేయబోయి పక్కనే ఉన్న రాళ్ల పై పడి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు.

Similar News

News December 27, 2024

నెల్లూరు: జీజీహెచ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా మహేశ్వర్ బాధ్యతలు 

image

నెల్లూరు జిల్లా సర్వజన ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారిగా గురువారం మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఏవోకు ఆసుపత్రి పర్యవేక్షకులు సిద్ధనాయక్, అభివృద్ధి కమిటీ సభ్యులు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి సౌకర్యాల కల్పనలో ముందు ఉంటామన్నారు.

News December 26, 2024

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు

image

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, నరసింహ యాగం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణ కార్యక్రమం వేద పండితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

News December 26, 2024

REWIND: నెల్లూరులో జలప్రళయానికి 20 మంది బలి

image

సునామీ ఈ పేరు వింటేనే నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న నెల్లూరు జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగుట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకున్నా ఆ భయం అలానే ఉందని నెల్లూరు వాసులు పేర్కొంటున్నారు.