News December 12, 2024

అర్ధరాత్రి అమిత్ షా, ఫడ్నవీస్ భేటీ

image

కేంద్రమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడణవీస్ బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి? అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. CM పదవి ఇవ్వలేదని అలకబూనిన శిండే Dy.CMగా ఉండేందుకు ఇంకా అంగీకరించలేదని సమాచారం. దీంతో ఆయనను ఒప్పించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Similar News

News January 14, 2026

ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అంజలి శార్వాణి

image

ఆదోనికి చెందిన క్రికెటర్ అంజలి శార్వాణి ఆంధ్ర మహిళా సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నుంచి జరిగే వన్డే టోర్నీ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆమెను సారథిగా ప్రకటించింది. గతంలో భారత జట్టు తరఫున ఆడిన ఆమె, మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే సర్జరీ పూర్తి చేసుకున్న అంజలి, మైసూర్ సెలక్షన్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి తన ఫిట్‌నెస్‌ను చాటుకున్నారు.

News January 14, 2026

గంగిరెద్దుల విన్యాసాలు – పల్లెటూరి సందడి

image

సంక్రాంతి వేళ పల్లె వాకిళ్లలో గంగిరెద్దుల సందడి ఉంటుంది. చక్కగా అలంకరించిన ఎద్దును ఇంటింటికీ తిప్పుతూ, డోలు సన్నాయి వాయిద్యాల మధ్య విన్యాసాలు చేయిస్తారు. ‘అయ్యగారికి, అమ్మవారికి దండం పెట్టు’ అనగానే ఆ ఎద్దు తల ఊపుతూ అభినయించడం ముచ్చటగా ఉంటుంది. శివుని వాహనమైన నందిగా భావించి, ప్రజలు వీటికి పాత బట్టలు, ధాన్యం దానం చేస్తారు. గంగిరెద్దులు ఇంటికి రావడం లక్ష్మీప్రదమని, పశుసంపద వృద్ధి చెందుతుందని నమ్మకం.

News January 14, 2026

IISER తిరుపతిలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) 22 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, MBBS, MD, PG, MSc, MCA, BS-MS, M.LSc, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్/స్కిల్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iisertirupati.ac.in