News December 12, 2024

STOCK MARKETS: సానుకూల సంకేతాలే..

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై లాభాల బాటపట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. EU, US సూచీలు నిన్న లాభపడ్డాయి. ఆసియా నుంచి నేడు సానుకూల సంకేతాలే అందుతున్నాయి. జపాన్, తైవాన్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 14 పాయింట్లే పెరిగింది. ఫియర్ఇండెక్స్ INDIA VIX కూల్ ఆఫ్ అవుతుండటం సానుకూలం. STOCKS TO WATCH: NUVAMA WEALTH, GLAND PHARMA, RELIANCE POWER, VARROC ENGINEERING, IOB, VEDL

Similar News

News September 15, 2025

ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

image

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.

News September 15, 2025

రాష్ట్రానికి అదనంగా 40వేల MT యూరియా

image

TG: రాష్ట్రానికి మరో 40వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80వేల MT సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం. ఈ పంటలకు రానున్న 15 రోజులు చాలా కీలకం. అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని <<17720342>>కోరాం<<>>’ అని వెల్లడించారు.

News September 15, 2025

MBBS అడ్మిషన్స్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

image

TG: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు చేసుకోండి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 18న రాత్రి 11.30 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. యూనివర్సిటీ ఫీజు రూ.12,000 తప్పనిసరిగా చెల్లించాలని పేర్కొంది.